మీ గుండెల్లో గుడి కట్టుకునేలా అభివృద్ధి చేస్తా

మీ గుండెల్లో గుడి కట్టుకునేలా అభివృద్ధి చేస్తా

ఒక్క అవకాశం ఇస్తే హుజురాబాద్ రూపు రేఖలు మార్చి చూపిస్తా

ముద్ర, జమ్మికుంట: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ తోపాటు నేను హుజురాబాద్ మొత్తాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జమ్మికుంట మండలంలోని సైదాబాద్ తో పాటు జమ్మికుంట మున్సిపాలిటీలోని కృష్ణ కాలనీలోని 26, 27,28 శివాలయం 25,30 వద్ద హుజురాబాద్ రోడ్డు 6,7,21 అలాగే కొత్తపెళ్లి వద్ద 4,5, 17 18 19 20 వార్డులలో జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి పేదలకు  దేవుడయ్యారని అన్నారు. మొన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిని గెలిపిస్తే హుజురాబాద్ సర్వతో ముఖాభివృద్ధికి బాధ్యత నాది అన్నారని గుర్తు చేశారు.  దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటుతో పాటు 19 రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. దీంతోపాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ప్రతి ఇంటికి మేనమామలా లక్ష 116 రూపాయలు ఇస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని,  వాటితో కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు ఆలోచించే ముఖ్యమంత్రి రాబోయే అసెంబ్లీ ఎన్నికల భాగంగా కొత్త మేనిఫెస్టో ఏర్పాటు చేశారని అందులో ముఖ్యంగా సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 రూపాయలు అందించడంతోపాటు ఆరోగ్యశ్రీని 15 లక్షల పెంచుతామని అన్నారు. దీంతోపాటు ప్రతి కుటుంబానికి 5 లక్షల ఉచిత బీమా అందిస్తూ గ్యాస్ సిలిండర్ను కూడా 400 కి అందించనున్నామని అన్నారు. రైతులకు 16 వేల రూపాయలు పెట్టుబడి సాయం కూడా అందించనున్నామని, అలాగే రేషన్ కార్డు ఉన్న వారందరికీ అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం అందించనున్న మన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు రైతులను మోసం చేసేలా వాగ్దానాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదు గంటల కరెంటు ఇస్తామంటే, బిజెపి పార్టీ నాయకులు మోటార్ల దగ్గర మీటర్లు పెడతాం అని అంటున్నారని అన్నారు. 24 గంటల కేసీఆర్ ప్రభుత్వం కావాలో లేక కాంగ్రెస్, బిజెపిలు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.

 తెలంగాణలో ఈ రెండు పార్టీలు గెలిచిన ఢిల్లీ నాయకుల ముందు చేతులు కట్టుకోవడం తప్పదని అన్నారు. తెలంగాణ కోసం ఏది కావాలన్నా ఢిల్లీ వారి దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడాల్సిందేనని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి ప్రజలకు ఏం కావాలో తెలుసని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈసారి ఒక్క అవకాశం కల్పిస్తే హుజురాబాద్ అభివృద్ధితో రూపు రేఖలు మార్చి చూపిస్తానని అన్నారు. జమ్మికుంట లోని ప్రభుత్వ ఆసుపత్రిని కూడా 100 పడకలుగా మారుస్తానని, అలాగే జమ్మికుంటలో అద్భుతమైన స్పోర్ట్స్ గ్రౌండ్ తో పాటు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కడతానని అన్నారు. అలాగే నాయిన్ చెరువును 100 కోట్లతో టూరిజం స్పాట్గా మారుస్తానన్నారు. అండర్ గ్రౌండ్ బిట్స్ తోపాటు ఔటర్ రింగ్ రోడ్ వేస్తానని అన్నారు. జమ్మికుంటను మరో సిద్దిపేట్ లా మారుస్తానన్నారు.  వేరువేరుగా మీరు జరిగిన కార్యక్రమాల్లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెలు శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ తక్కల్లాపల్లి రాజేశ్వరరావులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.