కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఆర్. వి. కర్ణన్ నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అవడంతో, జిల్లా నూతన కలెక్టర్ గా డా: బి. గోపిని ప్రభుత్వం నియమించింది, ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను బి. గోపి స్వీకరించారు. అంతకు ముందు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ కు అయన చేరుకోగా అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం అయన రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి, మానకోండుర్ శాసన సభ్యులు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.