రాహుల్ కు ప్రజల్లో క్రేజ్ పెరిగింది

రాహుల్ కు ప్రజల్లో క్రేజ్ పెరిగింది

మాజీ రాజ్యసభ సభ్యులు  విహెచ్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ప్రజల్లో రాహుల్ గాంధీ పై విపరీతమైన క్రేజ్ పెరిగిందని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. కరీంనగర్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ యావత్ భారతదేశం లో ఏ పొలిటికల్ పార్టీ కూడా క్యాస్ట్ సెన్సెక్స్  చెస్తానని చెప్పలేదన్నారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే బిసిల  గూర్చి మాట్లాడిన నికార్సైన నేత అని కొనియాడారు. భారతదేశ జనాభాలో అరవై శాతం ఉన్న బిసిలకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఖమ్మం సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించామని  ప్రియాంక గాంధీ సభలో మహిళ డిక్లరేషన్ కూడా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.


నరేంద్ర మోడి ఓబిసి ప్రధాని అయి ఉండి కూడా బిసి లకు న్యాయం జరగకపోవడం సిగ్గుచేటు అన్నారు. 0.5 శాతం ఉన్నవారే తెలంగాణ లో పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల కమిటీ లో పొన్నం ప్రభాకర్ పేరు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పొన్నం ప్రభాకర్ కి రిక్వెస్ట్ చేస్తున్నా మీకేమైనా నిరాశ ఉంటే సరిచెస్తాం అధిష్టానం మీకు సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు.
నాకు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కానీ రాజకీయ సమీకరణల వల్ల కాలేకపోయానని తెలిపారు. బి ఆర్ ఎస్ శాసనసభ్యుడు తన పేరు మీద భూములని అఫిడవెట్ లో రాయకుండానే రైతుబంధు ఎలా తీసుకున్నాడని ప్రశ్నించారు. కెసిఆర్ నీ శాసన సభ్యుడే నిన్ను మోసం చేసాడని దుయ్యబడ్డారు. తెలంగాణ ప్రజల్లో మార్పు వచ్చింది. కెసిఆర్ నీ గద్దె దించే సమయం ఆసన్నమైందని వెల్లడించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు.