ప్రభుత్వ  ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి  

ప్రభుత్వ  ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి  

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలోని గర్బిణులందరికి ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో  సాధారణ ప్రసవాలు కాకుండా సి-సెక్షెన్ (ఆపరేషన్) ద్వారా జరిగే ప్రసవాలను నిర్వహిస్తున్న ఆసుపత్రులు, ప్రసవాలపై దృష్టిసారించి, తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా వందశాతం వ్యాధినిరోధక టీకాలు అందేలా చూడాలని అన్నారు.

3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ అంగన్వాడీ కేంద్రాల వద్దే బాలామృతం అందించాలని తెలిపారు. ఎండతీవ్రత దృశ్యా ఉపాధిహామీ పనులు నిర్వహించు ప్రదేశాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవి శ్యాంప్రసాద్ లాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, జిల్లా ప్రధాన ఆసుపత్రికి సూపరింటెండెంట్  కృష్ణ ప్రసాద్, వైద్యులు, ఐసిడిఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.