ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం  రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు  మామిడి అంజయ్య అధ్వర్యంలో మండల నాయకులు కేక్ కట్ చేసి వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.  

ఈ కార్యక్రమంలో మాజీ  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామోజు కృష్ణమాచారి, ఉపాధ్యక్షులు  పెసరు రాజేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ చెప్యాల శ్రీనివాస్, మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, జిల్లా రైతుబంధు సభ్యులు సాంబారి కొమురయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జక్కుల రవీందర్, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, సన్నీల్ల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, నాయకులు కరివేద మహేందర్ రెడ్డి, ఆకవరం శివప్రసాద్, ఎస్కే సిరాజ్, కొమ్మర భూపతిరెడ్డి, వంతడుపుల దిలీప్, ఆకుల మొగిలి   తదితరులు పాల్గొన్నారు.