రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ముద్ర,హుజురాబాద్: తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు చేస్తున్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. మండల ఎంపీడీవో ఆఫీస్ ముందు గత ఎనిమిది రోజులుగా గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు మంగళవారం సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీల ద్వారా వేతనాలు ఇవ్వాలన్నారు.

పిఆర్ సిలో నిర్ణయించిన మినిమం బేసిక్ రూ.19 వేల రూపాయలు వేతనంగా చెల్లించాలని, స్లీపర్లకు జీవో నెంబర్. 60 ప్రకారం రూ.15,600, ఎలక్ట్రిషన్,పంపు ఆపరేటర్,కారోబర్,బిల్లు కలెక్టర్, డ్రైవర్లకు రూ.19,500లు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయా లన్నారు. పాత కేటగిరి అన్నిటిని యధావిధిగా కొనసాగించాలి. విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమాపతిరావు, మహిపాల్, కిషోర్ గ్రామపంచాయతీ వర్కర్స్ పాల్గొన్నారు.