ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

ముద్ర, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్తుల గూడెం చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు , స్థానిక కౌన్సిలర్ పోనగంటి సారంగం , ఎలంగందుల శ్రీహరి , కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.