వివేకానందుని స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం - ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి

వివేకానందుని స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం - ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : స్వామి వివేకానందుడు దేశ భక్తి, ధృడ సంకల్పానికి మారుపేరని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో స్వామి వివాకానంద వర్థంతి  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ  స్వాంతత్ర్య సమరంలో కీలకంగా వ్యవహరించిన గొప్ప ఆదర్శమూర్తి స్వామి వివేకానందుడు అన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. నేటి యువత వివేకానందుని ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వారి ప్రసంగాలు దేశానికి గొప్ప మేల్కొలుపు అని కొనియాడారు. గురుభక్తి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాత విషయాలలో పరిజ్ఞాన్ని అమితంగా పెంపొందించుకొని విశ్లేషించి  ఉన్నత శిఖరాలను అందుకున్నారని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.