జైత్రయాత్రకు కేటీఆర్ యాక్షన్ ప్లాన్

జైత్రయాత్రకు కేటీఆర్ యాక్షన్ ప్లాన్
  • బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్
  • కెసిఆర్ హైట్రిక్ సీఎం కావడంలో కరీంనగరే కీలకం
  • అన్ని సర్వేల్లో బీఆర్ఎస్ కు ఆధిక్యత
  • బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జైత్రయాత్ర కొనసాగించడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. కేటీఆర్  హైదరాబాదులో అందుబాటులో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాలు సాధించే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2001లో పార్టీ ఏర్పాటుచేసినప్పటి నుండి తిరుగులేని ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. నాటి నుండి నేటి వరకూ జిల్లా ప్రజలను మమేకం చేస్తూ తీసుకున్న ప్రతీ కార్యక్రమం విజయవంతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా పనిచేస్తుంది. తాజా సర్వేల్లోనూ, అన్ని నివేధికల్లోనూ ఈసారి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు అనుకూలమైన ఫలితాలు రానున్నట్లు జిల్లా ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ తెలిపినట్లు స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు కొల్లగొట్టే విదంగా రాబోయే మూడునెలలు పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు మొదలు కార్యకర్త వరకూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రౌండ్ క్లియర్ గా ఉందని, కేసీఆర్  మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి జైత్రయాత్ర ఇక్కడినుండే మొదలవుతుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంతో పాటు జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్న తీరుకు ప్రజల్లో మంచి స్పందన వ్యక్తమౌతుందని పేర్కొన్నట్లు తెలిసింది. కనీస పోటీనిచ్చే పరిస్థితిలో కనుచూపు మేరలో ప్రతిపక్షాలు లేవని, ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంతో పనిచేసి కీలకమైన రాబోయే మూడు నెలలు పూర్తి స్తాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించారు.  
ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సాంస్కృతిక సారథి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు విఫ్ బానుప్రసాద్, ఎల్.రమణ, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రమేష్ బాబు, వొడితెల సతీష్ కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, సంజయ్, కోరుకంటి చందర్ లు పాల్గొన్నారు.