కవులకు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్

కవులకు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్

కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు

ముద్ర ప్రతినిధి కరీంనగర్: సినీ సంగీత, సాహితి, కళలు, కవులు, కళాకారులతో కళకళలాడే జిల్లా కరీంనగర్ జిల్లా అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని స్థానిక ఫిలీంభవన్ లో ఆదివారం  ఆర్కేస్ట్రా కళాకారులు కిట్ల శ్రీనివాస్ ఆద్వర్యంలో సినీ దర్శక నిర్మాత కే. విశ్వనాథ్, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సింగర్ వాణీ జయరాం ల దివ్యస్మృతి లో భాగంగా సంగీత సాహితీ కళాకారులతో కిట్ల స్వర నీరాజనం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి ప్రజ్వలనం చేసి స్వర నీరాజన సంగీతాన్ని ప్రారంభించారు. అనంతరం వారి చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అతిథిగా హాజరైన మేయర్ యాదగిరి సునీల్ రావు ను  కళాకారులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా గతం నుండే కళలకు కొదువలేని జిల్లా అన్నారు. సీనారే లాంటి ఎంతో మంది కవులు, రచయితలు, సినీ సంగీత, సాహీతి కళాకారులు ప్రపంచ నలుమూలలకు కరీంనగర్ జిల్లా ఖ్యాతిని చాటి చెప్పారని తెలిపారు.

చాలా మంది సినీరంగంలో గానీ సంగీత సాహిత్యం లో ఎంతో మంది కళాకారులు జిల్లాలో ఉండటం గర్వకారణం అన్నారు. కళలను కళాకారులను ప్రోత్సహించేందుకు మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లు వారికి ఒక వేదిక ఉండాలని 14 కోట్ల రూపాయల నిధులతో పెద్ద కళాభవనాన్ని నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఎస్ ఆర్ ఆర్ కళాశాల ఆవణలో కల్చరల్ కార్యక్రమాలు జరుపుకునేలా నగరపాలక సంస్థ ద్వారా అమృత వర్షిణీ ఆడిటోరియం కూడ నిర్మాణం చేస్తున్నామని త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. బాల్ భవన్ కళాకారులైన చిన్నారులను ప్రోత్సహించే విధంగా పెద్ద వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక నూతన బాలభవన్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కవులను, కళాకారులను ప్రోత్సహించుకొని కరీంనగర్ జిల్లా పేరును ఇంకా నిలబెట్టేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కళాకారుల వెంట మా పాలకవర్గం తప్పకుండ ఉండి పలు కార్యక్రమాల్లో తగిన సహాకారం అందిస్తారన్నారని. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్, కిట్ల శ్రీనివాస్, పలువురు సంగీత, సాహీతి కళాకారులు పాల్గొన్నారు.