ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం రావడం అదృష్టం

ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం రావడం అదృష్టం
  • పార్టీలకు అతీతంగా సేవ చేస్తేనే నాయకునిగా గుర్తింపు
  • ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి 
  • ఎంపీపీ,జడ్పీటీసీ,ఎంపీటీసీ లకు సన్మానం చేసిన అధికారులు,పార్టీల నాయకులు

ముద్ర,పానుగల్ :-ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డికి, జడ్పీటీసీ లక్ష్మి చంద్ర శేఖర్ నాయక్ కు,వివిధ గ్రామాల ఎంపీటీసీలకు ఎంపిడిఓ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది పూలమాల,శాలువాతో ఘనంగా సన్మానించారు..ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించడం,గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో అధికారుల సహకారం మరువలేనిది అని ఎంపీపీ,జడ్పీటీసీ,పలువురుఎంపీటీసీలు అన్నారు..

ఐదేండ్ల పదవీ కాలం ఎంతో సంతృప్తి ఇచ్చిందని జీవితకాలం గుర్తుండిపోతుందన్నారు.ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.అధికారుల సన్మాన అనంతరం వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎంపీపీ,జడ్పీటీసీ,ఎంపీటీసీలను పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.అలాగే ఎంపిడిఓ కార్యాలయంలో పని చేస్తున్న అటెండర్ బుచ్చన్న పదవీ విరమణ పొందడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ అశోక్,వ్యవసాయ అధికారి సాజిద్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్,వెటర్నరీ డాక్టర్ శ్యామ్,ఎంపీవో రఘు రామయ్య,వివిధ గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు..