రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం  ‐ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం  ‐ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,  వనపర్తి : రైతును రాజు ను చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వము కొనుగోలు చేస్తుందని సాగు విస్తీర్ణం రెట్టింపు అయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చెరువుల కుంటాలలో పుష్కలంగా నీరు ఉండడంతో దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో వరి ధాన్యం పంట పండుతుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ చలవనే అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు రైతు శ్రేయస్సు కోసమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే   ధాన్యాన్ని విక్రయించాలని ఆయన రైతులకు సూచించారు.

కొత్తకోట ప్రాథమిక సహకారం సంఘం ఆధ్వర్యంలో...

కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మల్లంబాయి దగ్గర అలాగే అమడబాకుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుకేషిని, డిసిసిబి డైరెక్టర్ వంశీధర్ రెడ్డి, ఎంపీపీ గుంతా మౌనిక,  సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి లు కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పి విశ్వేశ్వర్,  ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్,  మోహన్ కుమార్, చాపల రామకృష్ణారెడ్డి, అమ్మ పల్లె బాలకృష్ణ,  కొండారెడ్డి,  సాయిదాబ రాజు, అలీం, మైబు, వెంకటేశ్వర్ రెడ్డి,  బాలకృష్ణారెడ్డి, అల్లా భాష,  రాము యాదవ్,  సుభాష్ తదితరులు పాల్గొన్నారు.