ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : త్వరగా గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని హామీ. దేశానికి కంటి వెలుగు పధకం ఆదర్శం. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. ఈరోజు గద్వాల మండలం పరిధిలోని గుర్రంగడ్డ  గ్రామాలలో  రెండు విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, హాజరయ్యారు. రెండు విడత కంటి వెలుగు శిబిరాన్ని కేంద్రానికి  ప్రారంభించారు ఎమ్మెల్యే, రెండు విడత కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేసుకున్న వృద్ధులకు ఎమ్మెల్యే పర్యవేక్షించడం జరిగినది. ఎమ్మెల్యే కి సర్పంచ్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ

కెసిఆర్. ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మొదటి విడత కంటి వెలుగు ఆగస్టు 15 2018 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18న సీఎం కేసీఆర్. చేతుల మీదుగా  లో ప్రారంభమైనది.  
తెలంగాణ రాష్ట్రంలో అంధత్వానికి  గురైన ప్రజల కంటి సమస్యలను తీర్చాలనే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఏ కంటి సమస్య ఉన్న వారైనా నివారణ మార్గాలను, అత్యున్నత నాణ్యత కలిగిన వైద్య ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వైద్య శిబిరాలను ప్రారంభించడం జరిగిందని వివరించారు. కంటి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కేంద్రాల దగ్గర ప్రజలకు, వైద్యులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా  ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ గ్రామంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వం అధికారులు ప్రజలకు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా అన్ని గ్రామాల్లో  పరిష్కరించడం జరుగుతుంది. గ్రామంలో ఇప్పటివరకు 80 లక్షల వ్యవంతో సీసీ రోడ్డులో, మట్టి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది.
త్వరలో బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని ప్రజలకు రాకపోకల సౌకర్యము కల్పించే విధంగా త్వరగా అందుబాటులో తీసుకురావాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపి ప్రతాప్ గౌడ్, సర్పంచ్ బాలకృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, నీలేశ్వర్ రెడ్డి బీచుపల్లి, జగన్ రెడ్డి, శ్రీరాములు, శ్రీను, వైద్యులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, గ్రామ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.