గ్రామ దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే

గ్రామ దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : మల్దకల్  సవారమ్మ అవ్వ దేవర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.

ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్దకల్  మండలం కేంద్రంలోని సవారమ్మ అవ్వ దేవర సందర్భంగా అమ్మవారిని దేవాలయం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని గ్రామదేవతలను కూడా ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.  

ఎమ్మెల్యే మాట్లాడుతూ..

గ్రామంలోని గ్రామదేవతలను పూజించడం వల్ల గ్రామానికి ఇలాంటి చెడుగాలి సుఖకుండా  గ్రామంపై ఎలాంటి నరదృష్టి రాకుండా గ్రామదేవతలు కాపాడడం జరుగుతుంది. గ్రామదేవతల ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిన్ను నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమప్ప, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్,ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు,  వైస్ ఎంపీపి వీరన్న, సర్పంచ్ యాకోబు, మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అజయ్ నరేందర్, మధు నాయకి, పరశురాముడు, నర్సింహులు, కిష్టన్న,మల్దకల్  తిమ్మరాజు, ప్రభాకర్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు