సీపీయస్ రద్దుకై ఏప్రిల్ 16న పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్

సీపీయస్ రద్దుకై ఏప్రిల్ 16న పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : పాత పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయుల రాజ్యాంగ హక్కు- అది సాధించే వరకు పోరాటం ఆగదు. టీఎస్ సిపిఎస్ ఈయు జిల్లా అధ్యక్షుడు వడ్డే నాగరాజు, నేడు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గద్వాల్ జిల్లా కేంద్రంలోని స్థానిక కే.ఎల్.ఐ క్యాంప్ లో జిల్లా నీటి పారుదల కార్యాలయంలో టీఎస్ సిపిఎస్ఈయు (తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్) జోగుళాంబ గద్వాల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ- గతంలో సీపీయస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిపిన పోరాటాల ఫలితంగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్ వచ్చాయని, రాబోయే సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ని పునరుద్ధరించే విధంగా పోరాటం ఉదృతం చేస్తామన్నారు. పెన్షన్ అనేది ఉద్యోగుల రాజ్యాంగ హక్కు అని ఆర్టికల్ 309 లో స్పష్టంగా పేర్కొనబడింది అని పాత పెన్షన్ సాధించే విధంగా టీఎస్ సీపీఎస్ఈయు రాష్ట్ర శాఖ వచ్చే ఆగస్టు 23వ తారీకు వరకు కార్యాచరణ ప్రకటించిందని దానిలో భాగంగా ఏప్రిల్ 16వ తారీఖున జిల్లా కేంద్రంలో  ఉదయం 9గంటల నుండి కాన్స్టిట్యూషనల్ మార్చ్ ఫర్ ఓల్డ్ పెన్షన్ (పాత పెన్షన్ సాధన ర్యాలీ) ర్యాలీని నిర్వహిస్తున్నామని సన్నాహక సమావేశంలో తెలిపారు.

ఇట్టి ర్యాలీ మార్గం జిల్లా కేంద్రం గద్వాల్లో స్థానిక పాత బస్టాండ్ నుండి మొదలై కొత్త బస్టాండ్ మీదుగా అంబేడ్కర్ చౌక్ వరకు కొనసాగి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణతో ముగుస్తుందని  జిల్లా నాయకులు  తీర్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సహాధ్యక్షులు విష్ణు మాట్లాడుతూ- వివిధ డిపార్ట్మెంట్లలోని సీపీయస్, ఒపియస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని  ఈ ర్యాలీనీ జయప్రదం చేయాలని కోరారు. ఇప్పటికే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలలో సిపిఎస్ ని రద్దు చేశారని తెలంగాణ రాష్ట్రంలో కూడా సిపిఎస్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో టిఎస్ సిపిఎస్ఈయు జిల్లా అధ్యక్షులు నాగరాజు, రాష్ట్ర సహాధ్యక్షులు విష్ణు, జిల్లా కోశాధికారి వన్నవాడ రమేష్ కుమార్, జిల్లా గౌరవాధ్యక్షులు బుచన్న, జిల్లా క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ నరసింహ, గద్వాల్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్ రెడ్డి, ఎల్లస్వామి,  పాల్వాయి లక్ష్మి నారాయణ, శ్రీనివాసులు, జిల్లా సలహాదారుడు కర్రెప్ప, జిల్లా కార్యదర్శి మస్తాన్ వలీ, జిల్లా టెక్నికల్ టీమ్ సభ్యులు ఆంజనేయులు, జిల్లా ఈ.సి మెంబర్స్ సుధాకర్, వీరన్న శెట్టి, పృథ్వీరాజ్, గట్టు మండల ప్రధాన కార్యదర్శి పరుషరాము మరియు ధరూర్ మండల ఉపాధ్యక్షులు చిరంజీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.