ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత

వైకాపా నుంచి సస్పెండైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని తన నివాసంలో ఉండగా గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు వైద్యులను రప్పించారు. ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  గత నెలలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు రెండు వాల్వులు బ్లాక్‌ అయినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. 2021 డిసెంబర్‌లో చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు రావడంతో బెంగళూరులో సర్జరీ చేసి స్టెంట్‌ వేశారు.