దేశంలో 24 గంటల్లో 3,095 కొవిడ్ కేసులు

దేశంలో 24 గంటల్లో 3,095 కొవిడ్ కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 3,095 తాజా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్క రోజులో 3,095 కరోనా కేసులు వెలుగుచూడటం రికార్డు అని వైద్యులు చెప్పారు. దీంతో దేశంలో ప్రస్థుతం మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,208 కు పెరిగింది. బుధవారం 2,151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా, రికవరీ రేటు ప్రస్తుతం 98.78 శాతంగా ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.  గోవా, గుజరాత్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు రోగులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. ఢిల్లీలో గురువారం ఒక్కరోజే 295 తాజా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. గత ఏడాది ఆగస్టు తర్వాత కరోనా వైరస్ తో ఇద్దరు వ్యక్తులు మరణించారు.కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో 765 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలతో ఈ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అన్ని సానుకూల నమూనాలను పంపాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది.