ఆదర్శ హిందీ ఉపాధ్యాయుడికి  డాక్టరేట్ పట్టా

ఆదర్శ హిందీ ఉపాధ్యాయుడికి  డాక్టరేట్ పట్టా

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:బాన్సువాడ మండలంలోని తెలంగాణ ఆదర్శ్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాదుడు విజయ్ కుమార్ కు  ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి  పి . హెచ్. డి.పట్టా దక్కింది." సమ్ కాలిన హిందీ కహానియో మే గ్రామీణ జీవన్"అనే అంశం పై ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలోని బోర్డ్ అఫ్ ఛైర్పర్సన్ డా. కే. సంగీత వ్యాస్  పర్యవేక్షణలో హెచ్. ఓ. డి. ప్రోపేసర్ డబ్లు. మాయదేవి చేతులు మీద పి హెచ్. డి. పట్టా అందుకున్నారు. 

కామారెడ్డి జిల్లాలో మారుమూల  జుక్కల్ మండలంలోని బిజ్జల్వాడి అనే  చిన్న గ్రామంలో  రాజ బాయి -  రామ్ చందర్  అనే దంపతులుకు పేద నిరుపేద కుటుంబంలో జన్మించారు ఎస్. విజయ్ కుమార్. తల్లీ తండ్రులు తో పాటుగా  బాల్యం నుంచి వ్యవసాయ కూలీ కుటంబం కాబట్టి, ఆర్థిక పరిస్థితి తులు అనుకూలించక పోవడంతో  మద్నూర్ లోని  సోషల్ వెలిఫెర్ వసతి గృహంలో పదవ తరగతి   వరకు చదువు పూర్తి చేసుకున్నారు. ఇంటర్ మరియు డిగ్రీ చదువుతూనే మెస్త్రీల దగ్గర కూలి  పని చేస్తూ చదువు పూర్తి చెసుకున్నారు. 2007 లో హెచ్. పీ .టి .పూర్తి చేసి  ప్రయివేట పాఠశాల లో  పాఠాలు  బోధిస్తు ఆ  క్రమంలో మిత్రులు ఒకరి సహకారంతో 2009 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో  పీ.జీ లో ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ సాధించాడు. పీ.జీ.పూర్తి చేసి  పార్ట్ టైం ఉద్యోగం చేస్తు 2011లో  డిస్టిన్షన్ లో ఉత్తీర్ణత సాధించారు. 2011 నుంచి జూన్ 2013  వరకు హైదరాబాద్ లోని ప్రయివేట్  కళాశాలలో బోధిస్తు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ ఆయి, 2012లో  మోడల్ స్కూల్ సెలెక్షన్ పరీక్ష రాసి జోన్ పరిధిలోని టాప్ ర్యాంకు సాధించారు.అలాగే Ap set లోకూడా ఉతిర్ణత సాధించారు. 2013లో  తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో  బాన్సువాడ మండలంలోని కోత్తబాద్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ  ఆదర్శ్ పాఠశాలలో టిజిటీ హిందీ ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు.

టీచర్ గా వృత్తి కొనసాగిస్తూనే చదువు ఆపకుండా డా. అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి .ఎచ్. డి.లో చేరి
డాక్టరేట్ అవార్డు సాధించాడు. ఈనెల 12న "సమ్ కాలిన హిందీ కహానియో మే గ్రామీణ జీవన్" అంశం పై ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలోని బోర్డ్ అఫ్ ఛైర్పర్సన్ డా. కే. సంగీత వ్యాస్ మేడం పర్యవేక్షణలో హెచ్. ఓ. డి. ప్రో. డబ్లు. మాయదేవి చేతులు మీద పి హెచ్. డి. పట్టా అందుకున్నారు.