డిఎస్పీకు ఘనంగా సన్మానం        

డిఎస్పీకు ఘనంగా సన్మానం        

బాన్సువాడ, ముద్ర: బాన్సువాడ డిఎస్పీ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టి. సత్యనారాయణని  ఏఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డిఎస్పీ ని సత్యనారాయణ  ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు.అక్షరం,ఆరోగ్యం,అభివృద్ధి అనే నినాదంతో పనిచేస్తున్న సభ్యులను అభినందించారు.  సమాజం కోసం పని చేయాలని,ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్,కుమ్మరి సాయి కుమార్,నక్క విజయ్ కుమార్,సాయిలు,బైరపూర్ గంగన్న,శ్రీనివాస్ ,రెడ్డి పర్వన్న తదితరులు పాల్గొన్నారు.