పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి - మాజీమంత్రి షబ్బీర్ అలీ

పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి - మాజీమంత్రి షబ్బీర్ అలీ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: పంచాయతీ కార్యదర్శులను గత నాలుగు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేయించుకొని రెగ్యులరైజేషన్ చేయకుండా కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని, వెంటనే పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాలని మాజీమంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
జేపీఎస్, ఓపిఎస్ శాంతియుత నిరవధిక సమ్మెలో  ఏడవ రోజు లో భాగంగా   పంచాయతీ కార్యదర్శులు కామారెడ్డి పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎదురుగా  నిర్వాహక దీక్ష చేపట్టగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ దీక్షలో పాల్గొని పూర్తి మద్దతు ప్రకటించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు  పేర్కొన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో యువకులు కేసీఆర్ మోసపూరిత రాజకీయంలో బలయ్యారన్నారు.త్వరలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే .మీ న్యాయపూరిత డిమాండ్లను మా పార్టీలో చర్చించి   కాంగ్రెస్ మేనిఫెస్టోలోపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రకరణ్ రెడ్డి ,భీమ్ రెడ్డి,లింగారెడ్డి. ఐరేనిసందీప్, గోనె శ్రీనివాస్,చందు, పంపరి లక్ష్మణ్. సర్పంచ్ రాజు, ప్రవీణ్, సల్మాన్, వైద్య కిషన్, వెంకటేష్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు