కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : డిఎంహెచ్ఓ  

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : డిఎంహెచ్ఓ  

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:ఇటీవల కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదయితున్న వేల  ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్ సింగ్ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా తాత్కాలికమైన జలుబు లాంటిదని, తగిన జాగ్రత్తలు , వైద్య  సలహాలు, సూచనలు  పాటిస్తే  తరిమికొట్టవచ్చని  అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా కరోనాను ఎదుర్కొనుటకు, కట్టడి చేయుటకు  సిద్ధంగా ఉన్నదని, అందరం కలిసి కట్టుగా పోరాడి కరోనాను జయిద్దామని అన్నారు.

కాగా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలని, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని, తప్పని పరిస్థితులలో వెళితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పెళ్లిళ్లకు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని  సూచించారు.  ప్రతిరోజూ గోరువెచ్చని నీరు త్రాగాలని,, బలమైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. జలుబు, జ్వరం లాంటివి వచ్చి తగ్గని యెడల   వెంటనే డాక్టరును సంప్రదించాలన్నారు. పాజిటివ్ వస్తే బయపడవలసిన పనిలేదని, ధైర్యంగా కుటుంభం సభ్యులను కలవకుండా ప్రత్యేక గదిలో ఉండాలని, లేదా ప్రభుత్వ కరోనా కేర్ సెంటర్ లో చేరి  వైద్యుల సూచనల మేరకు వారు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా  వాడాలని డాక్టర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు.