వారణాసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

వారణాసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు వారణాసి కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మోడీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ఎన్డీఎ నేతలు హాజరయ్యారు.

కాగా, ప్రధాని మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు 2014, 2019లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఆయన గెలుపొందారు. జూన్ 1న ఏడో దశ ఎన్నికల్లో వారణాసిలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ మోడీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.