అమృత్‌పాల్ కోసం మూడోరోజూ కొనసాగుతున్న వేట

అమృత్‌పాల్ కోసం మూడోరోజూ కొనసాగుతున్న వేట

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ సోమవారంనాడు మూడోరోజుకు చేరింది.  అతను పరారీలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవల గడువును ఈనెల 21వ తేదీ వరకూ పొడిగించారు. ప్రజా భద్రత దృష్ట్యా.. మొబైల్ నెట్‌వర్క్‌లు అందించే వాయిస్ కాల్స్, బ్యాంకింగ్, మొబైల్ రీచార్జ్ మినహా అన్ని ఎస్ఎంఎస్ సర్వీసులు, డాంగిల్ సర్వీసులు మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు పంజాబ్ హోం, న్యాయశాఖ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమృత్ పాల్ సింగ్ అంకుల్, డ్రైవర్ ఆదివారం రాత్రి పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన క్రమంలో ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు.