విఓఎల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్
పెద్దశంకరంపేట, ముద్ర: మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న విఓఎల సమ్మెకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఓఎల న్యాయబద్ధమైన తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా గ్రామాలలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతానికి వారు కృషి చేస్తున్నారన్నారు. వివోఎ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గత 34 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న విఓఎల పట్ల ప్రభుత్వము మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విఓఎల సంఘం అధ్యక్షురాలు కలాలి రాజేశ్వరి, రమా, స్వరూప, పుష్ప, విజయలక్ష్మి, శంకర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.