ప్రభుత్వ పథకాలను సద్విని యుగం తీసుకోవాలి

ప్రభుత్వ పథకాలను సద్విని యుగం తీసుకోవాలి

 నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి            

పెద్దశంకరంపేట, ముద్ర:ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం  క్యాంప్ కార్యాలయంలో మండలములోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. మండల పరిధిలోని మూసాపేట గ్రామానికి చెందిన వడ్ల వెంకటేశంకు 27 వేల రూపాయలు చెక్కు, పట్టణానికి చెందిన అబిద్ హుస్సేన్ కు 15 వేల రూపాయ చెక్కును అందజేశారు. అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు యాదుల్ హుస్సేన్,  నాయకులు శశిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.