తీవ్ర మనస్తాపం చెంది సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో ఆత్మహత్య...

తీవ్ర మనస్తాపం చెంది సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో ఆత్మహత్య...

ముద్ర,సంగారెడ్డి:-సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. అమీన్‌పూర్‌ ఎస్సై ఈవీ రమణ వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లోని దుర్గా హోమ్స్‌ ఫేజ్‌-2 విల్లా లో ఉండే కొల్లాటి కాశీ విశ్వనాథ్‌ (38) మాదాపూర్‌లో ఎక్లాట్‌ ప్రైమ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేసి దానికి సీఈవోగా పనిచేస్తున్నారు. 6 నెలల కిందట అదే కంపెనీని అమెరికాలో ఏర్పాటు చేయాలని అక్కడికి వెళ్లారు.

కానీ కంపెనీ ఏర్పాటు కుదరక పోవడంతో తిరిగొచ్చి, తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తన ఇంట్లోని కిటికీ కి చున్నీ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు.. విశ్వనాథ్‌ మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య వినీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.