పేట్‌ బషీరాబాద్‌లో అగ్ని ప్రమాదం - నాలుగు షాపులు దగ్ధం

పేట్‌ బషీరాబాద్‌లో అగ్ని ప్రమాదం - నాలుగు షాపులు దగ్ధం

ముద్ర,హైదరాబాద్:-పేట్‌ బషీరాబాద్‌లోని రాఘవేంద్ర కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ పండ్ల దుకాణం, మటన్‌ షాపు, స్క్రాప్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో మొత్తం నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.