రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం      

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం      

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధాపూర్ తండాకు చెందిన కిషన్, సవాయి సింగ్ లు కలిసి  బైక్ పై వివాహానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ అన్నారం కలాన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సవాయి సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ నడుపుతున్న సుభాష్కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.