లారీ, ఓనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

లారీ, ఓనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
  • లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్ 

ముద్ర/షాద్ నగర్:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లారీ, ఓనర్ ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ తెలిపారు. సోమవారం తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రామినేని, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్, జగన్నాథ్ రెడ్డి, సహాయ కార్యదర్శి నవాజ్ గోరీ, ఖాజ హైదరి, ఎండి సలీం, ఆల రామారావు లు కలిశారు.

ఈ సందర్భంగా సయ్యద్ సాదిక్ మాట్లాడుతూ లారీ యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించినట్లు సాదిక్ తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలను అమలు చేస్తానని హామి ఇచ్చారని, రేపు జరగబోవు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు మద్దతు ఇచ్చి ప్రచారం చేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేయుచున్నామని వివరించారు. లారీ ఓనర్స్ కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రవాణా రంగం అభివృద్ధి కోసం లారీ ఓనర్ అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందని అన్నారు.

రవణ రంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని రూపుమాపి రవాణా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని సాదిక్ తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ అసోసియేషన్ తరపున పూర్తి మద్దతు తెలియజేస్తామని సయ్యద్ సాదిక్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన లారీ ఓనర్స్ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి లారీ ఓనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు లారీ ఓనర్ అసోసియేషన్ కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.