వరంగల్ మహా నగరానికి చేయూతనందించిన మంత్రి కేటీఆర్
తక్షణ సహాయం కింద 250 కోట్లు
వరద బాధితులకు అండగా ఉందాం : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
కేసీఆర్, కేటీఆర్ ల చిత్రపటానికి పాలాభిషేకం
ఈరోజు హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అకాల వర్షాల కారణంగా వాతావరణ మార్పుల కారణంగా వరంగల్ పట్టణంలో వరదల ఉధృతికి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. 2020 సంవత్సరంలో పెద్ద ఎత్తున వర్షం నమోదు కాగా నగరంలో లోతట్టు ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు, నాళాలు, తెగిపోయాయని అన్నారు.అప్పుడు నగరాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్ తక్షణ సాయం కింద 20 కోట్లు తర్వాత 100 కోట్లు కేటాయించి నగర అభివృద్ధికి తోడ్పడ్డారని ఈ సందర్భంగా తెలిపారు. సంవత్సరంలో కురిసేటువంటి వర్షాపాతం ఒకే రోజున 275 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, సమ్మయ్య నగర్, రామ్ నగర్, జవహర్ నగర్ వంటి కాలనీలు నీట మునిగాయని తెలిపారు. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్నితెలుపుతూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు మున్సిపల్ శాఖ అధికారులు ఫైర్ అధికారులు పోలీసు డిపార్ట్మెంట్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నిరంతరం పర్యవేక్షించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వరదల ఉధృతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమీక్షించారని అన్నారు.
భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరంలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను పరిశీలించిన పిదప క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 1000 కోట్ల వరకు ఎస్టిమేషన్స్ పంపించగా తక్షణ సహాయం కింద నాలాల మరమ్మతులు, రోడ్డు డ్రైనేజీ మరమ్మతుల కింద 250 కోట్లు ఇతర పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కేటాయించిన మంత్రి కేటీఆర్ కు మున్సిపల్ కార్పొరేషన్ తరపున, వరంగల్ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. జరిగిన నష్టానికి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు ఈ తక్షణ సాయం అందించారని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం బాధాకరమని, వరదల సమయంలో మాట సహాయం ఓదార్పు చేయాల్సినటువంటి నాయకులు లేనిపోని అపోహలు సృష్టించడానికి, ప్రజలను భయాందోళనకు గురిచేయడానికి సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు పెట్టడాన్ని ఈ సందర్భంగా ఖండించారు. భద్రకాళి బండి పైన ఉన్న కట్ట తెగిపోయి నీరు రావడానికి కూడా రాద్ధాంతం చేసి అసభ్య ఆరోపణలు ప్రచారాలు చేశారని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 60 -70 ఏళ్ల క్రితం నాయకుల అశ్రద్ధ కారణంగా, నాళాలు ఆక్రమించుకొని, రోడ్లు ఆక్రమించుకొని వాటిలో నిర్మాణం చేపట్టడంజరిగిందన్నారు. కొంత సమయం తీసుకున్నప్పటికీ నాళాలను పూర్తిగా తొలగించే దిశగా అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయని అన్నారు.
24 గంటలు ప్రజలకు అండగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రచార కార్యక్రమంగా పెట్టుకుని ప్రజలను ఆందోళనకు గురి చేశారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేక ముంపు ప్రాంతాలను సందర్శించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కనీసం ఆర్థికంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించలేనటువంటి దుస్థితిలో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు ఇక్కడ రాదు అక్కడ రాదు అని ఈ సందర్భంగా తెలిపారు. జరిగిన ఈ నష్టం వరద బాధితులకు సహాయాన్ని అందించేది పోయి నగరాభివృద్ధికి సహాయపడేది పోయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సైతం కేంద్రం నుండి ఏం నిధులు తెచ్చి నగరాభివృద్ధికి కృషి చేస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేయాలి ప్రజలకు అండగా ఉండాలి గాని ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా పోస్టులు పెట్టి ఆందోళనకు గురి చేయడం బాధాకరమని అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని, ప్లాస్టిక్ నిషేధంతో రాబోయే తరాలకు బాసటగా నిలవాలని అన్నారు. తక్షణ అభివృద్ధి కింద చేపట్టవలసినటువంటి పునర్నిర్మాణ పనులకు టెండర్స్ అయ్యాయని అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని తెలిపారు.
వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం బిజెపి నాయకులు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని వారిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నాడని ప్రధాన నగరంగా ఉన్నటువంటి వరంగల్ నగరానికి అన్ని రకాల అభివృద్ధి కోసం ఎన్నో నిధులను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులను నిర్మించారని వర్షం కారణంగా ఒక్కో చెరువు నిండిన తర్వాత మరొక చెరువులోకి నీటి పారుదల ఉంటుందని, అతిగా వర్షపాతం నమోదైన కారణంగా ఈ చెరువులు నిండి నీరు బయటకు రావడం జరిగిందని తెలిపారు. దానికోసం వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్గా పనిచేసినప్పుడు కూడా నాలుగు విభాగాలతో చర్చించి ఒక ప్రణాళికను చేశామని తెలిపారు. కూడా, మున్సిపల్, ఆర్ అండ్ బి, నీటిపారుదల శాఖ వారితో నగరానికి కావలసినటువంటి ప్రణాళికను రచించి నగరానికి దశ దిశ నిర్దేశం చేయడం జరిగిందని చెప్పారు. బిజెపి నాయకులు ఆగమాగం హడావిడి చేస్తున్నారే తప్ప, ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని కేంద్రం నుండి నిధులు తేలేదని తెలిపారు. ప్రణాళిక బద్ధంగా నిర్మాణాలు చేపడితే వర్షం నీరు నిలవకుండా ఉంటుందని అన్నారు. అనంతరం కెసిఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, కార్పొరేటర్లు అశోక్ యాదవ్, రంజిత్ రావు,నాయకులు శివశంకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.