చాకలి ఐలమ్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

చాకలి ఐలమ్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

ముద్ర, శంకర్ పల్లి: వీరనారి చాకలి ఐలమ్మ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం   పోరాడిన యోధురాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పొద్దుటూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆమె ఆదివారం రోజున జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్   మహనీయుల త్యాగాలను గుర్తించి  సమచిత గౌరవం కల్పిస్తున్నారని  గుర్తు చేశారు. భావితరాలకు వీరి చరిత్ర తెలియాలనే ఉద్దేశంతోనే  చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతిలను  రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బిసి కులాల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం  చేయడం జరుగుతున్నదని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో  రూ. రెండు కోట్లతో మోడ్రన్ ధోబిఘాట్లను నిర్మిస్తుండగా శంకర్ పల్లి మున్సిపాలిటీకి  సైతం మోడ్రన్ దోబీ ఘాట్  మంజూరు కావడం జరిగిందని స్పష్టం చేశారు.

అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య వెంటే కార్యకర్తలు ఉండాలని సూచించారు. కరోనా వల్ల ఆర్టీసీ సంస్థ నష్టాల్లోకి వెళ్లడంతో, ప్రభుత్వం 43 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని  వివరించారు. అదేవిధంగా వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్డ్ చేసినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేష్, సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ ప్రవళిక వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, మాజీ సర్పంచ్  శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, జిల్లా ఎంపీటీసీల ఫోరం  మాజీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు గండి చెర్ల  గోవర్ధన్ రెడ్డి .రజక సంఘం అధ్యక్షులు చాకలి అనంతయ్య, ఉపాధ్యక్షులు చాకలి కుమార్, యూత్ అధ్యక్షులు  చాకలి మహేందర్, ఉపాధ్యక్షులు చాకలి నరసింహులు  రజక సంఘం నాయకులు వెంకటేష్, యాదయ్య, బాబు, నర్సింలు, అశోక్, అనంతయ్య, మల్లేష్, రమేష్, లక్ష్మణ్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.