అంతా మీ ఇష్టమేనా?! టీఎస్​పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

అంతా మీ ఇష్టమేనా?! టీఎస్​పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం
  • జేఎల్​నియామక పరీక్షపై కీలక వ్యాఖ్యలు 
  • తెలుగులో కూడా ప్రశ్నా పత్రం ఇవ్వాలని ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​కమిషన్​కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదంటూ సూచించింది. జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్– 2  తెలుగులోనూ ఇవ్వాలని ఆదేశించింది. పేపర్– 2 ఆంగ్లంలోనే ఇవ్వాలన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్లు, టీఎస్పీఎస్సీ తరపున వాదనలు పూర్తయిన తర్వాత ధర్మాసనం పై ఆదేశాలు జారీ చేసింది. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని హెచ్చరించింది. గత డిసెంబరు తొమ్మిదిన జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించే జేఎల్ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలను ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన టి.విజయ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.