మెఫి ఆధ్వర్యంలో కేరళ స్టోరీ' పై  వీకే చెరియన్ ప్రసంగం

మెఫి ఆధ్వర్యంలో కేరళ స్టోరీ' పై  వీకే చెరియన్ ప్రసంగం

మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా ( మెఫీ) ఆధ్వర్యంలో గురువారంనాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వివాదాస్పద చిత్రం 'కేరళ స్టోరీ' పై ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత, ఫిల్మ్ సొసైటీ ఉద్యమ ప్రముఖుడు వీకే చెరియన్  ప్రసంగం ఉంటుంది. మెఫీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ జర్నలిస్టుల శిక్షణ, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ, విలువలతో కూడిన పాత్రికేయతపై మెఫి నిర్వహిస్తున్న సదస్సులు, ప్రసంగాల పరంపరలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మెఫీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. మెఫీ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి అమర్, ట్రస్టీలు,  సీనియర్ జర్నలిస్టులు పాల్గొంటారు.