ఇక ప్రగతిభన్​లో ‘ సోమేశ్​’ పాగ..! సీఎం ముఖ్య సలహాదారుగా నియామకం

ఇక ప్రగతిభన్​లో ‘ సోమేశ్​’ పాగ..! సీఎం ముఖ్య సలహాదారుగా నియామకం

గత ఆర్నెళ్లు హాయిగా ఉన్న హెచ్​ఓడీలు
మళ్లీ సోమేశ్​ వేధింపులు తప్పవా అంటూ నిట్టూర్పు
ముద్ర తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గతంలో హవా కొనసాగించారు. సీఎస్​గా పదవీభాద్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సీఎం కేసీఆర్​ తర్వాత ఆయనే అన్న విధంగా వ్యవహరించారు. అయితే ఆయన వేధింపులకు సీనియర్​ ఐఏఎస్​, ఐపీఎస్​లతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు సైతం గురయ్యారు. అప్పట్లో సీఎం కేసీఆర్​ సమీక్షలకు హాజరయిన తర్వాత సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్​ చేసి మీ పైన సీఎం కేసీఆర్​ ఆగ్రహంగా ఉన్నారంటూ వారిని బెదిరింపులకు గురిచేసేవారని పలువురు సీనియర్​ అధికారులు సైతం వాపోయారు. అయితే కేంద్ర హోంశాఖ తనకు కేటాయించిన ఏపీలోనే పనిచేయాలంటూ ఆదేశించడం, తర్వాత ఏపీలో జాయిన్​ అవడం, తీరా వీఆర్​ఎస్​ తీసుకుని కేసీఆర్​ వెంట తిరుగుతుంటేనే ఇక సోమేశ్​ కీలకం కానున్నారంటూ సీనియర్​ అధికారుల్లో భయంపుట్టుకుంది. ప్రగతిభవన్​ వేదికగా సోమేశ్​కుమార్​పాలనపై సీనియర్​ అధికారులతో పాటు, శాఖల ఉన్నతాధికారుల్లో భయం పుట్టుకుంది. గతంలో సీఎస్​గా పనిచేసినప్పుడు అప్పుడప్పుడు సీఎంను కలిసి ఆయనకు అనుకూలంగా లేని వారిపై తప్పుడు సమాచారాన్నించి సీఎం దృష్టిలో వ్యతిరేక ముద్ర వేసిన సోమేశ్​కుమార్​, ఇక ప్రగతిభవన్​లో ఉంటూ పాలన కొనసాగించడంపై పలువురు ఉన్నతాధికారుల్లో భయం పుట్టుకుంది. ప్రగతిభవన్​లో సోమేశ్​ పెత్తనంపై జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు సైతం భయపడుతుండడం కొసమెరుపు!. 
సీఎంఓలో ఆయనే కీ‘లకం’
వీఆర్​ఎస్​ తీసుకున్న సోమేశ్​కుమార్​ను సీఎం కేసీఆర్​ తన ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈ మేరకు మంగళవారంనాడు సీఎస్​ శాంతికుమారి అందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాజీవ్​శర్మ ముఖ్యమంత్రి సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే సీఎం కేసీఆర్​కు నమ్మినబంటుగా ఉంటూ, యావత్​ పాలనను పరిశీలించిన సోమేశ్​కు తన ముఖ్య సలహాదారుగా నియమించడంతో ఇక ప్రగతిభవన్​లో సోమేశ్​ పాగ వేయనున్నారు.  మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రధాన సలహాదారుడిగా ఆయనకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. సోమేశ్‌కుమార్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం కలెక్టర్‌ సహా వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు.
ఆ తర్వాత గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు ఏపీ కేడర్‌కు చెందిన అధికారిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత డీవోపీటీ ఏపీకి బదిలీ  చేసింది. ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.
 ప్రగతిభవన్​ వేదికగా సోమేశ్​కుమార్​పాలనపై సీనియర్​ అధికారులతో పాటు, శాఖల ఉన్నతాధికారుల్లో భయం పుట్టుకుంది. గతంలో సీఎస్​గా పనిచేసినప్పుడు అప్పుడప్పుడు సీఎంను కలిసి ఆయనకు అనుకూలంగా లేని వారిపై తప్పుడు సమాచారాన్నించి సీఎం దృష్టిలో వ్యతిరేక ముద్ర వేసిన సోమేశ్​కుమార్​, ఇక ప్రగతిభవన్​లో ఉంటూ పాలన కొనసాగించడంపై పలువురు ఉన్నతాధికారుల్లో భయం పుట్టుకుంది. ప్రగతిభవన్​లో సోమేశ్​ పెత్తనంపై జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు సైతం భయపడుతుండడం విశేషం!. 
సీఎంను కలిసిన సోమేశ్​..
సీఎం ముఖ్య సలహాదారుగా నియామకం అయిన వెంటనే సోమేశ్​కుమార్​ ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఆయనకు ఆశీర్వాదాలు అందజేశారు