ఖాజాగూడా లో అంకుర ఆసుపత్రిని ప్రారంభించిన సోనూసూద్ 

ఖాజాగూడా లో అంకుర ఆసుపత్రిని ప్రారంభించిన సోనూసూద్ 

హైదరాబాద్ (ముద్ర న్యూస్): హైదరాబాదులోని ఖాజాగూడా లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన అంకుర హాస్పిటల్ 13వ బ్రాంచ్ ను ప్రముఖ సినీ నటుడు సంఘ సేవకుడు సోను సూద్ బుధవారం నాడు ప్రారంభించారు.

నైన్ ఎం పేరుతో అంకుర హాస్పిటల్ వారు విలాసవంతమైన సౌకర్యాలతో ఈ ప్రసూతి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సోనూసూద్ తో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆస్పత్రి ఎండి డాక్టర్ కృష్ణ ప్రసాద్, డైరెక్టర్ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంకుర ఆసుపత్రిలో మహిళలకు శిశువులకు సకల సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించినట్టు ఆసుపత్రి వారు వివరించారు.