ప్రతి పౌరుడు ఆర్ఆర్ఆర్ లో భాగస్వామ్యం కావాలి: మేయర్ జక్కా వెంకట్ రెడ్డి

ప్రతి పౌరుడు ఆర్ఆర్ఆర్ లో భాగస్వామ్యం కావాలి: మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
  • 15 రోజుల పాటు కొనసాగనున్న కేంద్రాలు
  • స్వఛ్ సర్వేక్షన్ 2023 లొ భాగంగా RRR సెంటర్ల ప్రారంభం
  • పీర్జాదిగూడ పరిధిలో 26 సెంటర్లు..

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో Swachh Survekshan 2023 లొ భాగంగా RRR (Reduce,Reuse,Recycle) సెంటర్లను ప్రారంభించడం జరిగింది. RRR యొక్క ముఖ్య ఉద్దేశం -  ప్రతి ఇంటి నుంచి వెలువడే పునర్వినియోగం చేయగలిగే (Recycled) వస్తువులు అనగా పాత బట్టలు, బెడ్ షీట్స్, పాతబుక్స్, పాత బొమ్మలు,ప్లాస్టిక్ వస్తువులు, మొదలగు RECYCLABLE వస్తువులు సేకరించి వాటిని మళ్లీ ఇతరులు ఉపయోగించే లా చేయడం... కావున నగర ప్రజలు ప్రతి ఒక్కరూ మీ యొక్క సంపూర్ణ సహకారం అందించి అవసరమైన వారికి ఆపన్న హస్తం అందించగలరు. ఇట్లు  జక్క వెంకట్ రెడ్డి - మేయర్  పీర్జాదిగూడ నగర  పాలక సంస్థ.

ఆర్ఆర్ఆర్ ఉద్దేశం...
RRR(Reduce,Reuse,Recycle) రెడ్యూస్ అంటే చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం. మనం వినియో గిస్తున్న వాటిలో ఏదైనా అవసరం ఉన్నంత వరకే వాడుకోవడం వలన ఆర్ధికంగా లాభం చేకూరడంతో పాటు భూమిని కాపాడు కోవడంలో మనవంతు సాయం అందించినట్ల వుతుంటారు. భూమి మీద ఉన్న వారందరూ రాబోయే ప్రమాదాలను పూర్తిగా నివారించక పోయినా.. దాని తీవ్రతను తగ్గించవచ్చునని చెప్పారు. చెత్త తగ్గాలంటే వాడి పారేసే వస్తువుల కంటే. మళ్లీ మళ్లీ వాడు -కోగల వాటికే ప్రాధాన్యమివ్వాలి సూచించారు. అలాగే మనం వాడిన వాటిని మళ్లీ మళ్లీ పునర్వనియోగించడాన్ని రీయూజ్ చెప్పవచ్చు. ఉదాహరణకు మంది కొనుగోలు చేసిన బట్టలు, వాహానాలను కొద్ది రోజుల వాడి పక్కన పడేస్తారు. కానీ ఇవి అవసరం ఉన్నవాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాగే ఇంట్లో మిగిలిన అన్నం పడేస్తారు. కానీ ఆ అన్నం బయట చాలా మంది ఆకలి తీరుస్తుంది. పిల్లల చదువుల కోసం పుస్తకాలను కొనుగోలు చేస్తారు. ఆ సంవత్సరం పూర్తవగానే ఓ మూలన పడేయడం, లేదా అమ్మేయడం చేస్తారు.

తక్కువ ఖర్చుతో...
తక్కువ ఖర్చుతో పాటు సులభంగా అన్ని అవస రాలకు ఉపయోగపడుతుండటంతో వాటిపై ప్రజలు ఎక్కు వగా ఆధారపనడుతున్నారు. కానీ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువుల వాడ కం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూమిపై ఉన్న జీవ రాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే యాభై మె క్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్లు, వస్తువుల విని యోగంపై నిషేధం అమల్లో ఉంది. కానీ ప్రజల భాగస్వామ్యం, సహకారం లేని కారణంగా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.. వాడేసిన ప్లాస్టిక్ ను రీ సైకిల్ చేయడం వలన కొత్త ఉత్పత్తి తగ్గు తుంది. చెడిపోయిన ఆహార పదార్థాల నుంచి సేంద్రీయ ఎరువు తయారికి ఉపయోగించాలి.

మీరూ.. భాగస్వామ్యం కావాలి: మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
మనం వాడిన వాటిలో ఎక్కువ వస్తువులను రీసైకిల్ చేయవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్, కాగి తం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటిని మరో అవసరానికి వినియోగించవచ్చు. కొన్ని, రకాల ప్లాస్టిక్ పదార్ధాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవ త్సరాల సమయం పడుతుంది. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యా మ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలో ఈ-వేస్ట్, యూఎస్ఏ డ్రైవ్లు, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నాయి. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

పీర్జాదిగూడ పరిధిలో 26 సెంటర్లు..
స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ 2.0లో భాగంగా కార్పోరేషన్ పరిధిలోని 26 వార్డుల్లో స్థానిక కార్పొరేటర్లు, కాలనీవాసులు సహ కారంతో ఆర్ఆర్ఆర్ వస్తువుల సేకరకణ కేంద్రాలను ఏర్పాటు చేశా మని మేయర్ తెలిపారు. సుమారు 15 రోజుల పాటు ఈ కేం ద్రాలు కొనసాగుతాయని, ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి పౌరుడు ఆర్ఆర్ఆర్ను ఆదరించడంతో పాటు ఇందులో భాగస్వామ్యం కావాలి మేయర్ పిలుపునిచ్చారు. ఇందులో రీయూజ్ చేసే పరికరాల కోసం కార్పోరేషన్ పరిధిలో అవుట్లెట్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.