న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన యువతి బంధువులు 

న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన యువతి బంధువులు 

ముద్ర,ఎల్లారెడ్డిపేట:- రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయిచెరువు తండాకి చెందిన మమత అనే యువతీ గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

తమకు న్యాయం జరగాలని బాబాయ్ చెరువు తండా గిరిజనులు భారీ సంఖ్యలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం రోజు ధర్నా రాస్తారోకో సుమారు గంటసేపు చేశారు. సమాచారం అందుకున్న డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్, సర్కిల్ సీఐ సదన్ కుమార్, ఎస్ఐ రమాకాంత్, వీర్నపల్లి ఎస్సై రమేష్, గంభీరావుపేట ఎస్సై  రామ్మోహన్, ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి, తంగళ్ళపల్లి  ఎస్సై సుధాకర్ లు కుటుంబ సభ్యులను శాంతింపజేయగా వారు వినకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నిందితుడు సతీష్ మాకు అప్పగించాలని, వారు డిమాండ్ చేశారు. మృతురాలు ధర్నా రాస్తారోకోలు అస్వస్థ గురికాగా ఎస్సై రమాకాంత్ వెంటనే తన సిబ్బందితో ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. డీఎస్పీ పలువురు కుటుంబ సభ్యులతో మాట్లాడి మీకు తప్పకుండా అన్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రాసారు ఒక విరమించుకున్నారు. దీంతో ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.