టెలిగ్రామ్ ద్వారా డబ్బులు డబుల్ చేస్తామని మోసం - రూ.9.79 లక్షలను కోల్పోయిన వ్యక్తి

టెలిగ్రామ్ ద్వారా డబ్బులు డబుల్ చేస్తామని మోసం  - రూ.9.79 లక్షలను కోల్పోయిన వ్యక్తి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ట్రేడింగ్ తో డబ్బులు డబుల్ చేస్తామని నమ్మబలికి, ఓ వ్యక్తి నుంచి రూ.9.79లక్షలు తీసుకుని, మోసం చేసిన ఘటన కామారెడ్డి లో జరిగింది. కామారెడ్డి ఎస్ హెచ్ ఓ తెలిసిన వివరాల ప్రకారం, కామారెడ్డికి చెందిన పల్మారి శ్రీకాంత్ అనే వ్యక్తికి గత నెల 29న, అతని మొబైల్ ఫోన్ వాట్సాప్ లో పార్ట్ టైం జాబులు చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని ఒక మెసేజ్ వచ్చింది. తనకు పార్ట్ టైం జాబులు చేయడం ఇంట్రెస్ట్ ఉందని, ఇతను టైప్ చేసి, వాట్సప్లో రిప్లై ఇవ్వగా,  అతనికి కొన్ని రివ్యూ టాస్కులను ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇతను దానికి ఓకే చెప్పి, ఆ టాస్క్ లను కంప్లీట్ చేషాడని,  ఆ తర్వాత వాళ్లు పంపిన ఒక టెలిగ్రామ్ లింకు క్లిక్ చేసి వారి గ్రూపులో యాడ్ అయ్యాడని తెలిపారు.

ఆ తర్వాత 30, 31 తేదీల్లో ఆ టాస్క్లను క్లియర్ చేసినందుకు గాను ఇతని అకౌంట్లో కొంత డబ్బులు కూడా వేయడం జరిగిందని తెలిపారు. అయితే ఆ తర్వాత ఎక్కువ టాస్కులు చేస్తే ఎక్కువ అమౌంటు వస్తుందని, దానికి కొంత డబ్బు కట్టాల్సి ఉంటుందని మోసగాళ్ళు నమ్మబలికారని తెలిపారు.  ఇతను ఆ మిషిన్ కి సంబంధించిన టాస్క్లను కంప్లీట్ చేసి, మొదటగా 9000/- రూపాయలు వేయగా 12,000/- వస్తాయని, ఆ విధంగా పెంచుకుంటూ 50,000, ఒక లక్ష ఇరవై వేలు, రెండు లక్షల 50 వేలు, 5,50,000 ఇలా డబ్బులు ఇతడు  ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి ఆ మర్చంట్ అకౌంట్ కు ఇతను మొత్తంగా తొమ్మిది లక్షల 79 వేల రూపాయలు కట్టడం జరిగిందని తెలిపారు.

ఈ విధంగా కట్టిన తర్వాత 8 లక్షలు మరలా పంపితే మొత్తంగా 23 లక్షల 64 వేల రూపాయలు వస్తాయని చెప్పగా ఇతనికి అనుమానం వచ్చి తాను మోసపోయినట్లు గ్రహించాడని తెలిపారు. దీంతో గురువారం ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వ్యక్తి  పార్ట్ టైం జాబ్ చేయాలని ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు  పంపిన లింకులను క్లిక్ చేసి మొత్తం మీద తొమ్మిది లక్షల 79 వేల రూపాయలను పోగొట్టుకోవడం జరిగిందని తెలిపారు.  శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని తెలిపారు.  గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన కాల్స్ గాని, మెయిల్స్ గాని,  టెలిగ్రామ్ యాప్ లో వచ్చిన లింకులు గాని, వాట్సప్లో వచ్చిన మెసేజ్ లకు గాని ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకూడదని, ఒకవేళ అలా చేసిన ఎడల వెంటనే 1930 కి కాల్ చేసి వివరాలు తెలియ పరచాలని కోరారు.

-