చింతగూడెం గ్రామంలో కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలి

చింతగూడెం గ్రామంలో కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలి
  • సిపిఎం పార్టీ నాయకులు శ్రీను నాయక్ డిమాండ్ 

షాద్ నగర్, ముద్ర:   ఫరూక్నగర్ మండలం చింతగూడ గ్రామంలో కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో  వర్షంలో తెగిపోయిన రోడ్డును పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు శ్రీను నాయక్ మాట్లాడుతూ కాశిరెడ్డి గూడ గ్రామం నుంచి చింతగూడెం గ్రామానికి వెళ్లే దారి మధ్యలో కల్వర్టు నిర్మించాలని గతంలో పడ్డ వర్షానికి రోడ్డు నిర్మాణం ప్రమాదంగా మారిందని వెంటనే పంచాయతీ రాజ్ అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామంలో గుంతల మాయమైన ప్రమాదాలకు కారణం అవుతున్న రోడ్డు ను మరమ్మత్తులను చేసి రోడ్డుమీద విస్తరణ పనులను చేపట్టాలన్నారు లేనిచో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల పంచాయతీరాజ్ కార్యాలయం ముట్టడిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సిపిఎం నాయకులు మాజీ ఉపసర్పంచ్ అర్జునమ్మ నాయకులు వెంకటేష్ మల్లారెడ్డి శివ కుమార్ సత్యం శ్రీకాంత్ రెడ్డి జగన్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.