రిటైర్మెంట్  ప్రకటించిన మాజీ మంత్రి  పేర్ని నాని 

రిటైర్మెంట్  ప్రకటించిన మాజీ మంత్రి  పేర్ని నాని 

సీఎం జ‌గ‌న్ తో ఇదే నా చివ‌రి మీటింగ్ అని మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.  వేదికపై నుంచి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు పేర్ని నాని. ఇవాళ కృష్ణాజిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి భారత్ స్కౌట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పేర్ని నాని మాట్లాడుతూ… వయసులో చిన్నవాడు అయిపోయాడు లేదంటే పాదాభివందనం చేసి ఉండేవాడిని.  నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ కు చేతులు ఎత్తి దండం పెడుతున్నానని పేర్ని నాని వెల్లడించారు. ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు ముఖ్యమంత్రి జగన్‌… ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారని వివరించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 450 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలో 25,090 మందికి పెట్టాలు ఇచ్చాం.. ఒక్క లే అవుట్ లోనే 15 వేల మందికి పట్టాలు ఇచ్చామని ప్రకటించారు. పోర్టు నిర్మాణానికి రాక్షసుడిలా చంద్రబాబు అడ్డుపడ్డాడు.  ఆ పీటముడులు తీయటానికి నాలుగేళ్లు పట్టిందని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నామినేషన్ వేసే వారం రోజుల ముందు పోర్టుకు శంకుస్థాపన చేశాడన్నారు.