9న యాదగిరిగుట్టకు కేటీఆర్ రాక 

9న యాదగిరిగుట్టకు కేటీఆర్ రాక 

ముద్ర ప్రతినిధి భువనగిరి :మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 9 న యాదగిరిగుట్ట లో  పర్యటించనున్నారని మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.భువనగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ నిర్వహించే  బైక్ ర్యాలీ లోఆయన   పాల్గొంటారని  తెలిపారు. అనంతరం  ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారని చెప్పారు. కేటిఆర్ తో పాటుగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లతో పాటుగా ముఖ్య నేతలు హాజరవుతారని  ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.