భువనగిరి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పడిగెల ప్రదీప్

భువనగిరి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పడిగెల ప్రదీప్
  • భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఎంపిక పత్రం స్వీకరణ

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పడిగెల ప్రదీప్ ను నియమిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. న్యూఢిల్లీలోని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఇద్దరి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ప్రదీప్ అందుకున్నారు. ఈ సందర్భంగా పడిగెల ప్రదీప్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్న తనను గుర్తించి యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శివసేనా రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిసిసి అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జులు సురభి ద్వివేది, రమేష్ బాబు, ఖాలిద్ అహ్మెద్, జిల్లా, అసెంబ్లీ అధ్యక్షులు బర్రె నరేష్, ఎండీ ఆవేస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.