మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్.. హెల్తి ఫుడ్

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్.. హెల్తి ఫుడ్
  • రాగి జావా, జొన్నగట్గా కు మొదలైన డిమాండ్
  • కొత్తగా చేరిన మిక్స్డ్ ఫ్రూట్ పీసెస్ బాక్స్
  • సిద్దిపేటలో  నయా ట్రెండ్...
  • 'ముద్ర  ప్రతినిధి' క్షేత్రస్థాయి పరిశీలనలో కనిపించిన  వెలుగు చూసిన నయా ట్రెండ్

సిద్దిపేట: ముద్ర ప్రతి నిధి : మారుతున్న ప్రజల జీవన ప్రమాణాల్లో భాగంగా,  పెరుగుతున్న అనారోగ్య సమస్యల కట్టడికి హెల్తి ఫుడ్ వైపు ప్రజలు దృష్టి సారిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో టిఫిన్ కే ఇన్నాళ్లు పెద్దపీట వేస్తున్నారు. చాలా చోట్ల రోడ్లమీద టిఫిన్ సెంటర్లు  మొబైల్ వాహనాల్లో హైవేల మీద పెట్టడాన్ని చూస్తున్నాం.ఆయిల్ క్వాలిటీ లోపం, కర్రీస్ విషయంలో నాణ్యత లోపాల వల్ల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు డాక్టర్‌ చెప్పే మాటలే కాకుండా బీపీ షుగర్ తదితర అనేక రకాల వ్యాధులను చిన్న వయసు నుంచి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ప్రజల్లో నెలకొన్నాయి ఈ పరిస్థితుల్లో డాక్టర్లు ఇచ్చే సూచనలు, సలహాలు అనుసరిస్తూ కోందరు ఆహారం విషయంలో,టిఫిన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే సిద్ధిపేట పట్టణంలో పలువురు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కింద హెల్తీ ఫుడ్ వైపు దృష్టి సారించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం నయా ట్రెండును పాటిస్తున్నారు.

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వాకింగ్ నిత్యం కంపల్సరీ కావడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైస్కూల్ గ్రౌండ్, కోమటి చెరువు కట్టల మీదికి రోజు ఉదయాన్నే వేలాదిమంది వాకింగ్ కోసం వెళ్తుంటారు. ఇందులో సామాన్యుల నుంచి, విద్యావంతులు, డాక్టర్స్, పొలిటిషన్ వరకు ఉన్నారు. వాకింగ్ అనంతరం ఎవరికైనా ఫ్రెష్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావడంతో దాన్ని చేసేందుకు హోటల్స్ వెళ్తుంటారు. అంత లాగే సిద్దిపేటలోనూ హోటల్స్ చాలా వెలిశాయి అయితే కొత్తగా ప్రత్యేకంగా స్థానికంగా అక్కడక్కడ హెల్తి ఫుడ్ సెంటర్లు కూడా ఇప్పుడిప్పుడే వెలిశాయి. డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో వాకింగ్ చేసి వెళ్లేవారు అక్కడ హెల్తీ ఫుడ్ సెంటర్ ను రెగ్యులర్గా అటెండ్ చేస్తున్నారు. రోడ్డుపై ఆరుబయట హెల్తి ఫుడ్ కింద రాగి జావా, జొన్నగట్కా, కలబంద జ్యూస్,లెమన్ గ్రాస్ జ్యూస్ తదితర హెల్తి ఫుడ్స్ ను మహమ్మద్ అస్లం గత మూడు సంవత్సరాలుగా విక్రయిస్తున్నాడు. ఈ రూట్ లో వెళ్లే హాస్టల్స్ స్టాప్,హాస్పిటల్స్ ఎంప్లాయిస్, గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరూ వాకర్స్ తో పాటు హెల్తీ ఫుడ్ స్వీకరిస్తున్నారు. గ్లాస్ రాగి జావా 20 రూపాయలు, గ్లాసు జొన్నగటుక 25 రూపాయలు, ఆలో వేరే జ్యూస్ 30 రూపాయలకు గ్లాస్  చొప్పున విక్రయిస్తున్నాడు. ఇక హై స్కూల్ గ్రౌండ్ సమీపంలో కొత్తగా ఇదే వ్యాపారాన్ని మరొకరు ప్రారంభించారు పక్కనే పోస్ట్ ఆఫీస్, కాలేజీ గ్రౌండ్ ఎదుట మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పేరుతో ఫ్రూట్స్ కటింగ్ పీసెస్ కలిపి ప్యాకెట్స్ రూపంలోవిక్రయిస్తున్నారు.

దీనికి స్థానికుల నుంచి విశేషమైన స్పందన వస్తుందని ఫ్రూట్స్ పీసెస్ అమ్మే సెంటర్ యజమాని కోర్తివాడ సాయికిరణ్ తెలిపారు. 40 రూపాయలకు ఒక బాక్స్ చొప్పున ఈ టిఫిన్ బాక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. బాక్స్ లో 12 రకాల ఫ్రూట్స్ పీసెస్ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ బ్రేక్ ఫాస్ట్ కింద కస్టమర్లకు అందిస్తున్నట్లు  తెలిపారు. ఈ బ్రేక్ ఫాస్ట్ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మూడు గంటలు మాత్రమే ఇక్కడ లభిస్తుంది. రోజుకు సుమారుగా 100 బాక్సెస్ సేల్ అవుతుందని తెలిపారు. హోటల్ టిఫిన్ రేట్ లోనే ఫ్రూట్స్ పీసెస్ బాక్స్ అందిస్తున్నట్లు ఆయన వివరించారు.ఇవే కాకుండా స్థానిక రైతు బజార్ వద్ద నానబెట్టిన పెసలు,శనగలు ,బొబ్బరులు, కలిపి లభించే మొలకల విక్రయం జరుగుతోంది. ఇది కరోనా సమయం నుంచి అధిక మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నట్లు వ్యాపారి తెలిపారు.  నిత్యము రైతు బజార్ కి వచ్చే స్థానికులతో పాటు చుట్టుపక్కల వారు కూడా హెల్తీ ఫుడ్ కింద మొలకల ప్యాకెట్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.

కేవలం పది రూపాయలకు గ్లాసు చొప్పున ప్యాకెట్ను చేసి విక్రయిస్తున్నారు. ఇంకా పట్టణంలోని పలుచోట్ల ఇలాంటి హెల్తీ ఫుడ్స్ సేల్స్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా స్థానిక పొలిటీషియన్స్ కూడా సేవా కార్యక్రమాల పేరుతో పట్టణంలోని పలుచోట్ల అంబలి విక్రయ కేంద్రాలను నెలకొల్పి రాగిజావను ఉదయం పూట ఉచితంగా ఇస్తున్నారు దీనికి కూడా ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. ఏది ఏమైనా హెల్తి ఫుడ్ కౌంటర్లను నిరుద్యోగ యువకులు వీటిని జీవనోపాధి కింద మార్చుకొని క్రయ,విక్రయాలు చేస్తున్నారు. హెల్తి ఫుడ్స్ విక్రయం వల్ల నిరుద్యోగులకు ఉపాధితో పాటు, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామి అవుతున్నందుకు నిజంగా వారిని అభినందించాల్సిందే.