ఈదురు గాలులతో భారీ వర్షం..తడిసిన వరి ధాన్యం... బస్తాలు 

ఈదురు గాలులతో భారీ వర్షం..తడిసిన వరి ధాన్యం... బస్తాలు 

గొల్లపెల్లి.ముద్ర:- గొల్లపల్లి మండల వ్యాప్తిగా ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. మంగళవారం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పలు చోట్ల వరి ధాన్యం తడిసి ముద్దఐన్నాయి.ఒక్కసారిగా భారీ ఈదురు గాలులతో వర్షం కురవడం తో మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పల్లోకి నీరు చేరింది.పలు చోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసి పోయాయి.కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.సరిపడ టార్పలిన్ కవర్లు లేకపోవడం వల్ల ధాన్యం తడిసి పోయిందని.త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకొంటున్న అన్నదాతలలో కలవరం మొదలైంది.

వాతావరణం చల్లబడడంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించిన పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్  స్తంభాలపై పడగా విరిగి విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా లేదని రైతులు అంటున్నారు. వాతావరణ మార్పుల మూలంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.అంతగా నష్టం వాటిల్ల లేదని అధికారులు తెలిపారు.తడిసిన ధాన్యాన్ని కొంటామని రైతులకు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు హామీ ఇవ్వడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.