బీఆర్ఎస్ ను గ్రామస్థాయిలో మరింత పటిష్టం  చేయాలి

బీఆర్ఎస్ ను గ్రామస్థాయిలో మరింత పటిష్టం  చేయాలి
  • బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ రెడ్డి పిలుపు

ఇబ్రహీంపట్నం, ముద్ర:-గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి పార్టీ పరిశీలకుడుగా సోమవారం గ్రామంలో పర్యటించారు.అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వం ప్రవేశ పెడతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలే పార్టీని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని, పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా దళిత బంధు లబ్ధిదారుడు మంకు వినోద్ పెయింట్ షాపును పరిశీలించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు చీరాల రమేష్, కార్యదర్శి బహదూర్, మార్కెట్ డైరెక్టర్ జాని పాషా, నాయకులు ఎన్ శేఖర్ పాల్గొన్నారు.