మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణదే ప్రథమ స్థానం: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణదే ప్రథమ స్థానం: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: దేశంలో వైశాల్యం లో10 వ స్థానంలో ఉన్న తెలంగాణ ... మంచి నీటి లో పెరిగే చేపల ఉత్పత్తి లో దేశంలో నంబర్ వన్ గా ఉందని జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని  శుభమస్తు ఫంక్షన్ హాల్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఎమ్మేల్యే ప్రారంభించి,వివిధ చేపల ఆహార వంటకాలను పరిశీలించి రుచి చూశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండ పోచమ్మ,మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ లలో చేపలను పెంచి,వివిధ ఆయకట్టు బాగు చేసుకొని మత్స్య సంపద అభివృద్ది, చేపలను పెంచి గంగపుత్రుల, ముదిరాజ్ ల కుల వృత్తులకు సియం కేసీఅర్ పెద్ద పీట వేశారని, రాష్ట్రం లో నీలి విప్లవం సియం కేసీఅర్ ఆలోచన విధానంకు నిదర్శనమన్నారు.

గంగ పుత్రులు అభివృద్ధికి నిధులు కేటాయించి వారికి మోపెడ్ లు,వలలు,సేఫ్టీ జాకెట్,తెప్పలు,ఉచిత చేపలు,రొయ్యలు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గం లో 172 చెరువులను 47 కోట్ల తో మిషన్ కాకతీయ లో భాగంగా పూడిక తీత చేయటం జరిగింది. చెరువుల పైన ఆధారపడి జీవనం సాగిస్తున్న  ప్రతి ఒక్కరికీ చెరువుల పండగ శుభా కాంక్షలు అన్నారు. గతానికి ,ఇప్పటికీ చెరువుల పరిస్తితి నీ రైతులు గంగ పుత్రులు ఆలోచన చేయాలని, నిండు వేసవిలో సైతం చెరువులు నిండు కుండల మారాయన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్,అదనపు కలెక్టర్ బి ఎస్ లత,మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, ఎఫ్ సి ఎస్ ఛైర్మెన్ గుమ్ముల ఆంజయ్య,కోరుట్ల వెటర్నరీ కాలేజ్ డీన్ మాధవ రావు,కౌన్సిలర్ లు బోడ్ల జగదీష్,అల్లే గంగ సాగర్,fcs డైరెక్టర్ ఆరుముల్ల పవన్,fcs మాజీ అధ్యక్షులు జంబర్థిశంకర్,నాయకులు వేణు,మహేష్,శ్రీను,తదితరులు పాల్గొన్నారు.