నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన...

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన...

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాలలో భాగంగా సిరిసిల్ల లో నిర్వహించే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు.ఉదయం 10.00 గంటలకు సిరిసిల్ల పాత బస్టాండు వద్ద గల అమర వీరుల స్థూపముకు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్ సిరిసిల్లలో జరుగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 11 గంటలకు జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.