కార్మికుల పిల్లలను పనిలో దింపతే కఠిన చర్యలు...

కార్మికుల పిల్లలను పనిలో దింపతే కఠిన చర్యలు...

పిల్లలను కార్మికులు గా మార్చవద్దు...
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:ఇటుక బట్టిల వద్ద పని చేస్తున్న కార్మికులకు,వారి పిల్లలకు అన్ని రకాల వసతులు కల్పించే బాధ్యత ఇటుక బట్టీల యజమానులదేనని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా  పోలీస్ అధికారులు వారి పరిధిలో ఉన్న ఇటుక బట్టీల వద్ద తనిఖీలు నిర్వహించి ఇటుక బట్టీల యజమానులతో సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్  మాట్లాడుతూ జిలాల్లోని ఇటుక బట్టీల వద్ద పని చేయడానికి వలస కార్మికులు బతుకు దెరువు కోసం స్వరాష్ట్రం వదిలి వేలాది కిలోమీటర్ల దూరం వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారనీ,వారి పిల్లలు సైతం వారి చెంతనే ఉంటూ భవిష్యత్తు కార్మికులుగా మారుతున్నారు. కార్మికులకు  తగు వసతులు కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇటుక బట్టీల నిర్వహకులను ఆదేశించారు..
జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిలాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులు ఇటుక బట్టి యజమానులతో సమావేశం ఏర్పాటు చేయించి కార్మికుల బాగోవులు చూడడంతో పాటు వారి పిల్లలను కార్మికులుగా మార్చవద్దని కచ్చితంగా వారికి విద్యాభ్యాసం కల్పించాల్సిందేనని వారికి అన్ని రకాల వసతులు కల్పించే విధంగా అవగాహన కల్పించారనీ అన్నారు.ఈ తనిఖీల్లో ఇటుక బట్టీల వద్ద బాలకార్మికులు లేరు అని,కార్మికుల పిల్లలను పని లో దింపుతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.