BREAKING NEWS: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో: వరంగల్ లో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు సంచలన కామెంట్లు చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి 10 నుంచి 12 సీట్లలో గెలిపించండి... మళ్లీ ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ పాలించే పరిస్థితి వస్తుందని అన్నారు. “ఇక్కడవున్న మీ అందరికీ, వేదికమీద కూర్చున్న మా అందరికీ ఎంత బాధవుందో.. నాకు తెలుసు. అయ్యో.. కేసీఆర్ గారు లేరు.. పేద ప్రజల సంక్షేమం ఆగిపోయింది. మన ప్రభుత్వం పోయినాక కరెంట్ పోతాంది. మంచినీళ్లు సక్కగా వస్తలేవు. వాటర్ ట్యాంకర్లు తిరిగే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం పోయినాక, ఇది వరకు పెట్టిన మంచి మంచి కార్యక్రమాలన్నీ బంద్ చేస్తున్నడు రేవంత్ రెడ్డి ”అని అన్నారు. కేసీఆర్ తిరిగి రావాలని మీరు అనుకుంటే.. రాష్ట్ర రాజకీయాలను ఆయన శాసించే రోజు రావాలి అని మీరనుకుంటే, పార్లమెంటు ఎన్నికలలో మాకు ఒక పది, పన్నెండు సీట్లివ్వండని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా కష్టపడితే, వరంగల్ లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.