పిహెచ్ డి ఉపాధ్యాయుడికి సన్మానం 

పిహెచ్ డి ఉపాధ్యాయుడికి సన్మానం 

బాన్సువాడ, ముద్ర : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పిహెచ్ డి చేసిన ఉపాధ్యాయుడికి ఘనంగా సన్మానించారు. బాన్సువాడ మండలంలో పనిచేస్తున్న విజయకుమార్  డాక్టరేట్ పట్టా వచ్చిన సందర్భంగా స్థానిక సాయికీర్తి జూనియర్ కళాశాలలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నార్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని మారుమూల జక్కల్ మండలం బిజ్జల్వాడి  గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన విజయ్ కుమార్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోని, కూలి పని చేసి చదువును పూర్తిచేసుకోని ఈ రోజు "సమకాలీన్ హిందీ కహానియోమే గ్రామ జీవన్" అనే అంశంపై ఉస్మానియా విశ్వ విద్యాలయం క్బోర్డ్ ఆఫ్ చైర్ పర్సన్ డా. సంగీతవ్యాస్ పర్యావేక్షణలో ప్రొఫెసర్ మాయాదేవి చేతుల మీదగా PHD పట్టాను  అందుకోవడం మన పండిత వర్గానికే గర్వకారణమని అభినందించారు.   

ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత Dr. విజయ్ కుమార్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (RUPPT) జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, రాష్ట్ర కార్యదర మంత్రి మధుసుదన్, సీనియర్ నాయకులు ఎల్లయ్య,B రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు K. లాల్సెంగ్, ప్రసన్న కునూర్, యాదవ్, నర్సయ్య, సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.